మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ను పురస్కరించుకొని జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమము సూడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు చేతుల మీదుగా నిర్వహించనైనది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి పౌరుడు గర్వించదగిన రోజు ఈ రోజు అని అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమాలను అందరము జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం అందించవలసిన రోజని అన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేయనైనది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీడీవో శ్రీ జె.ప్రవీణ్ కుమార్, తాసిల్దార్ శ్రీ అల్లం రాజకుమార్, ఎంపీ ఓ సాజిదా బేగం, గౌరవ వైస్ ఎంపీపీ శ్రీమతి సూది రెడ్డి స్వప్న, మరియు ఎంపీటీసీలు శ్రీమతి చాపల ఉమాదేవి, శ్రీమతి గుండెబోయిన నాగలక్ష్మి,,శ్రీమతి ఎలిషాలస్వరూప లావుడియా రామచందర్, కోఆప్టెడ్ మెంబర్ మొహమ్మద్ బాబర్, కార్యాలయ సిబ్బంది మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.