తెలంగాణ ఆర్టీసీ ‘దసరా’ బంపర్ ఆఫర్

నవతెలంగాణ – హైదరాబాద్: పండుగకు ఇళ్లకు వెళ్లాలనుకుంటున్న వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి 29 తేదీల మధ్యలో రానూపోనూ ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 30లోగా ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్ని సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు. ఈ సదవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love