నేడు తెలంగాణా రన్‌

విజయవంతం చేయండి : ప్రభుత్వ ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం నిర్వహించనున్న తెలంగాణా రన్‌ విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం 6 గంటలకు నెక్లెస్‌ రోడ్‌లోని డాక్టర్‌. బీఆర్‌. అంబేద్కర్‌ విగ్రహం సమీపంలోని మైదానం 2కే, 4 కే రన్‌ ఉంటుందనీ, అందులో దాదాపు ఐదువేల మంది రన్నర్లు పాల్గొననున్నట్టు తెలిపింది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొంటారు. అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులూ పాల్గొంటారు. ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, బెలూన్స్‌ ఎగురవేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Spread the love