నవతెలంగాణ- నవీపేట్: రైతులకు ఒకే ధఫాలో రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో వీర్ సింగ్ బుధవారం వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి విడతలవారీగా రుణమాఫీ చేయడంతో చివరకు రైతుకు ఎలాంటి మాఫీ జరగడంలేదని అన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒకే ధఫాలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.