నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాహిత్య సభలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభ సమావేశంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొంటారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం డా. ఎన్ గోపికి ప్రధానం చేస్తారు. వివిధ అంశాలపై రోజంతా సాహితీ చర్చలు, పత్ర సమర్పణలు జరుగుతాయి.