డా.చిటికెనకు తెలంగాణ రాష్ట్ర  సాట్స్ చైర్మన్ అభినంధన

                                                    
నవతెలంగాణ సిరిసిల్ల: ప్రముఖ కథా రచయిత, వ్యాసకర్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ( ఎస్. ఎ. టీ. ఎస్ ) చైర్మన్ సన్మానించారు. సాహిత్య పరంగా రచనలతో విశేష సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు సమాజాన్ని చైతన్య పరుస్తున్న తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన  ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యుడు, ఓ తండ్రి తీర్పు – లఘుచిత్ర కథా రచయిత డా. చిటికెన కిరణ్ కుమార్ ను  తెలంగాణ రాష్ట్ర  క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డా.ఇ. ఆంజనేయ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయం లో సన్మానించారు.  చిటికెన   సమకాలీన సామాజిక అంశాలపై తను రచించిన చైతన్య స్ఫూర్తి – చిటికెన వ్యాసాలు సంపుటిని అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో  పాల్గొన్న  హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  కవులు రచయితలు చేసే  సేవలు ఉత్తమమైనవని సమాజాన్ని ప్రగతి బాటలో నడిపించే దిశా నిర్దేశకులని చిటికెన ను అభినందిస్తూ తను రచించిన రచనలు సందేశాత్మకంగా ఉన్నాయన్నారు.
Spread the love