రేపు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ టెట్ ఫలితాలు రేపు అనగా జూన్ 12వ తేదీన విడుదల కానున్నాయి. మే 20 నుంచి జూన్‌ 2 వరకు టెట్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు రాగా, 2,36,487 మంది హాజరయ్యారు. పేపర్‌ వారీగా చూస్తే.. పేపర్‌-1కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. ఇక పేపర్‌-2కి 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 82.58 శాతం మంది హాజరయ్యారు. తొలిసారి రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. జూన్ 03న ప్రాథమిక ‘కీ’విడుదల చేశారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్దం అయ్యారు.

Spread the love