తెలంగాణ యూనివర్సిటీ నూతన వెబ్సైట్ ఆవిష్కరణ..

New website of Telangana University launched..నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ నూతన వెబ్సైట్ ను వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు శనివారం ఆయన చాంబర్ లో ఆవిష్కరించారు. యూనివర్సిటీ లో పనిచేస్తున్న అధికారుల సమగ్ర వివరాలతో పాటు వర్సిటీ అందించే వివిధ కోర్సులు, అనుబంధ కళాశాలలు, అవి అందించే కోర్సుల వివరాల ను ఈ వెబ్సైట్ లో పొందుపరిచారు.వర్సిటీ లో ఉన్న వివిధ విభాగాలతో పాటు పరీక్షల విభాగం, డైరెక్టర్రేట్  ఆఫ  అకడెమిక్ ఆడిట్, అడ్మిషన్ల విభాగం, ఐ క్యూ ఏసీ , ఎన్ స్ స్ , హాస్టల్స్ తదితర విభాగాల వివరాలు ఈ వెబ్సైట్ లో పొందుపరిచారు. విద్యార్థుల కు, కళాశాలకు సంబంధించిన నోటిఫికేషన్ లు, పరీక్షల తేదీలు  తదితర విషయాలను ఎప్పటి కప్పుడు వెబ్సైట్ లో పొందుపరచ నున్నట్టు ప్రొఫెసర్ యాదగిరి రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీ. చంద్రశేఖర్, వెబ్సైట్ అండ్ నెట్వర్క్ డైరెక్టర్ డాక్టర్ అతిక్ సుల్తాన్ ఘోరి, డాక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
Spread the love