ఇండియా-ఎ జట్టులోకి తెలుగు కుర్రాడు

నవతెలంగాణ హైదరాబాద్: ఇండియా-ఎ జట్టులోకి తెలుగు కుర్రాడు ఆంధ్ర యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ ఇండియా-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. రేపు అనంతపురంలో ఇండియా-డితో జరగబోయే మ్యాచ్ లో రషీద్ ఆడుతున్నాడు. కాగా రషీద్ గతంలో ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడుతున్నాడు.

Spread the love