వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య..!

నవతెలంగాణ-హైదరాబాద్ : వారణాసిలో ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండా వప్రియ (50) తన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌లతో (23) కలిసి కైలాశ్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. డిసెంబర్ 3న వారు ఆ ధర్మశాలలో చేరారు. అయితే, గురువారం కుటుంబం అంతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా లభించిందని వారణాసి కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ ముథా జైన్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకే తాము బలవన్మరణానికి పాల్పడినట్టు వారు చిట్టీలో రాశారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Spread the love