తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం…

నవతెలంగాణ – విశాఖపట్నం: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై టాటా హేరియర్ వాహనం అతివేగంగా దూసుకొచ్చి ఓ బైకు, స్కూటీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ప్రయాణీకులు ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయారు. వివరాల ప్రకారం.. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై టాటా హేరియర్‌ వాహనం బీభత్సం సృష్టించింది. టాటా హేరియర్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడం వల్ల వాహనం బైకు, స్కూటీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయాడు. దీంతో.. అతని తలకి బలమైన గాయాలు తగిలాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. టాటా హేరియార్ వాహనంను డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి లా అండ్ ఆర్డర్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

Spread the love