నవతెలంగాణ – హైదరాబాద్: బసవతారకం ఆస్పత్రి లక్షలాదిమందికి సేవలందిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆస్పత్రి వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. ఆయన 18 గంటలు పనిచేసి.. నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.