తెలుగు టాలన్స్‌ బోణీ

– గుజరాత్‌పై 39-32తో గెలుపు
– ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌
జైపూర్‌: ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) ఆరంభ సీజన్‌ అట్టహాసంగా ఆరంభమైంది. జైపూర్‌లోని సవారు మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో గురువారం పీహెచ్‌ఎల్‌ తొలి సీజన్‌ మొదలైంది. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్‌ పాట్రియాట్స్‌, మహారాష్ట్ర ఐరన్‌మ్యాన్‌ పోటీపడ్డాయి. 28-27తో ఐరన్‌మ్యాన్‌పై పాట్రియాట్స్‌ ఒక్క గోల్‌ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఇక తొలి రోజు రెండో మ్యాచ్‌లో తెలుగు జట్టు టాలన్స్‌ దుమ్మురేపింది. గార్విట్‌ గుజరాత్‌తో తలపడిన తెలుగు టాలన్స్‌ 39-32తో సాధికారిక విజయం సాధించి సీజన్లో బోణీ కొట్టింది.

Spread the love