సెంట్రల్ జైలుకు తెలుగు యూట్యూబర్..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌ : తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌ను పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఈ కేసులో 25 మంది సాక్షులను విచారించిన పోలీసులు, 17 మందితో సాక్ష్యం చెప్పించారు. ఈ తీర్పుపై భార్గవ్ అప్పీల్‌కు వెళ్లినా పైకోర్టు స్వీకరించదని పోక్సో కోర్టు స్పెషల్ PP మూర్తి వెల్లడించారు.

Spread the love