కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమ్మె తాత్కాలిక వాయిదా..!

–  సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ- కంటేశ్వర్
కాంట్రాక్టు ఏఎన్ఎంల సమ్మె తాత్కాలిక వాయిదా పడిందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం డిఎంహెచ్ఓ కి సమ్మె ఉన్నందున ఆ సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు అతి పత్రం ఇవ్వడం జరిగింది. డీ ఏం హెచ్ వో మాట్లాడుతూ.. మీరు మీ పి ఎస్ సి లలో జాయినింగ్ కండి అనీ సానుకూలంగా స్పందించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఎఎన్ఎంలను యదావిధిగా రెగ్యులర్ చేయాలని, రాత పరీక్షను రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆగస్టు 15 జెండా వందనం తర్వాత నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు సమస్యలపై ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరిగా తేది:01.09.2023 శుక్రవారం రోజున జరిగిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామని చెప్పారు. దాని ప్రకారం తేది: 02.09.2023 శనివారం రోజున ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీఅయినందున సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసి తేది: 04.09.2023 సోమవారం నుండి విధులకు హాజరవుతున్నాము. సమ్మె కాలంలో ఏమైనా క్రమశిక్షణా చర్యలు ఉంటే ఉపసంహరించుకోగలరని కోరుతూ, ప్రభుత్వం ఏఎన్ఎం లకు న్యాయం చేయలేకపోతే మరలా పోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుష్ప జమున కవిత సరోజా. ధన. సావిత్రి, వరమ్మ రాణి విజయలక్ష్మి, గంగ తదితరులు పాల్గొన్నారు.
Spread the love