రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ

రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ– లోక్‌సభకు ఎన్నికైన ఎగువసభ సభ్యులు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ అయ్యాయి. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ పది మంది సభ్యులు ఎన్నికయ్యారు. రాజ్యసభ సెక్రెటేరియట్‌ ఆ ఖాళీలను నోటిఫై చేసింది. ఇందులో అసోం, బీహార్‌, మహారాష్ట్రల్లో రెండు, హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపురల్లో ఒక్కొటి చొప్పున ఉన్నాయి. రాజ్యసభ సెక్రెటేరియట్‌ సీట్ల ఖాళీ వివరాలు తెలియజేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ”కామాఖ్య ప్రసాద్‌ తాసా, సర్బానంద సోనోవాల్‌ (అసోం), మిసా భారతి, వివేక్‌ ఠాకూర్‌ (బీహార్‌), దీపేందర్‌ సింగ్‌ హుడా (హర్యానా), జ్యోతిరాదిత్య సింథియా (మధ్యప్రదేశ్‌), ఉదయన్‌రాజే భోంస్లే (మహారాష్ట్ర), పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), కేసీ వేణుగోపాల్‌ (కేరళ), విప్లవ్‌ కుమార్‌ దేబ్‌ (త్రిపుర) ఖాళీలు ఏర్పడ్డాయి. నోటిఫికేషన్‌ తర్వాత ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తేదీలను ప్రకటించనుంది.

Spread the love