మండల కేంద్రంలోని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడైన వడ్డే హనుమంతుకు తోటి అభివృద్ధి కమిటీ సభ్యులు రూ. పదివేల ఆర్థిక సహాయం అందజేశారు. అనారోగ్యానికి గురై ఆరోగ్యం క్షీణించడం వల్ల వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న హనుమంతుకు ఆర్థిక సహాయం అదజేశారు. ఈ మేరకు మంగళవారం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు హనుమంతు ఇంటికి వెళ్లి పరామర్శించారు. గ్రామ అభివృద్ధి కమిటీ నుండి రూ. పదివేల ఆర్థిక సహాయం అందజేశారు. తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆర్థికంగా చేయూత అందించిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు హనుమంతు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, కోశాధికారి నూకల బుచ్చి మల్లయ్య, సభ్యులు సున్నం మోహన్, గణేష్, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, ఇతర సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.