నవతెలంగాణ – తిరుపతి: తిరుపతి లోని రేణిగుంట విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరుపతి లోని రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్ రద్దయింది. దీంతో రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 నిమిషాలకు రేణిగుంట వచ్చి తిరిగి 8.15 నిమిషాలకు కు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. ఉదయం నుంచి వేచి ఉండటంతో అసహనంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఎటువంటి ప్రయత్నయా ఏర్పాట్లు కల్పించకపోవడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు…నిరసనకు దిగారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఎయిర్ లైన్స్ మేనేజర్ మరియు సిబ్బందిపై ఆగ్రహిస్తున్నారు.