– ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్ తొలగించారని కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
– ఆర్డీవో ఛాంబర్‌ను ఆధీనంలో తీసుకున్న వైనం
– పరిస్థితి చేయి దాటడంతో ఆందోళన కారులపై పోలీసుల లాఠీఛార్జ్జీ
– ఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ భారతీ హౌళికేరి
– ఘటనపై ఆరా
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రతినిధి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను తొలగిం చారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యా లయం వద్ద కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్ తొలగిం చారని శనివారం రాత్రి వారు నిరసన చేప ట్టారు. స్ట్రాంగ్ రూంలో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ సీల్ తొలగించి ఉం డటం, అందులో ఉన్న బ్యాలెట్లు లేకపోవడంపై రిట ర్నింగ్ అధికారిని నిలదీశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3,057 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఆరు బాక్సు లు స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాలి. కానీ, ఆరు బాక్సులు ఆర్డీవో కార్యాలయంలో ఉండటంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.
భారీ స్థాయిలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసి ఉండడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రానికి గురయ్యారు. ఈ విష యం ఒక్కసారిగా దవాణంలా వ్యాపించడంతో వం దలాది మంది ఆర్డీఓ కార్యాలయానికి తరలిం చారు. ఆర్డీవో చాంబర్లను ముట్టడించారు. వారిని అదుపు చేయడం పోలీసుల తరం కాలేకపోయింది. నేరుగా ఆర్డీఓ ఛాంబర్‌ను తన ఆధీనంలోకి తీసుకొని ఆందోళన చేపట్టారు. అధికార పార్టీతో కుమ్మకై ఆర్డీఓ అనంత రెడ్డి పోస్టల్ బ్యాలెట్లను మార్పిడి చేశారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులు 30వ తేదీ లోపే కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్‌కి చేరాల్సి ఉంటే ఎందుకు ఆర్డీవో కార్యాలయంలో పెట్టుకున్నారని విమర్శలు చేశారు. మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్‌రావు ఆధ్వర్యంలో ఆందోళనకారులను సముదాయించారు. ఇటు ఆర్డీఓ అనంతరెడ్డి, ఆటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డితో చర్చలు జరిపారు. శాంతించాలని ఫోన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. దాంతో కార్యకర్తలు ఆర్డీఓ ఛాంబర్‌ను వదిలి బయటకు వెళ్లారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జీ
పరిస్థితి అదుపులోకి రాకపోవడంలో పోలీసులు ఆందోళనల కారులపై లాఠీలు ఝూలిపించారు. దొరికిన వారిని దొరికినట్టే చితకబాదారు. నాగార్జున సాగర్ జాతీయ రహదారిపైకి పరుగులు పెట్టించా రు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భారతీ హౌలికేరి ఘటనా స్థలానికి వచ్చారు. అక్కడి పరి స్థితిని సమీక్షించారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం బరిలో నిలిచిన ఎమ్మెల్యేలు ఒకరు ఒకరు ఆర్డీఓ కార్యాలయా నికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. కలెక్టర్‌తో వారు చర్చించారు.
కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలు
ఆందోళన కారులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల ను నెట్టి వేశారు. దాంతో ఇబ్రహీం పట్నంకు చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త కిం దపడిపోవడంతో తన కుడి చేయి విరిగిపోయింది. అత న్ని వెంటనే పార్టీ నాయకులు ఆస్పత్రికి తరలించారు.
ఆర్డీఓ కుర్చీలో కాంగ్రెస్ నేత
పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేశారన్న అను మానంతో ఆర్డీఓ కార్యాలయంలో ఆం దోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు ఒక్క అడుగు ముం దుకు వేసి ప్రోటోకాల్ తప్పారు. ఆర్డీ ఓ ఛాంబ ర్‌ను ఆ పార్టీ శ్రేణులు ముట్టడించగా, ఇబ్ర హీంపట్నంకు చెందిన సబ్బురు పాండు అనే నాయకుడు ఏకంగా ఆర్డీఓ కుర్చీలో కూర్చు న్నారు. తీరిగ్గా కూ ర్చున్న అతన్ని పక్కనే ఉన్న ఆ పార్టీ నాయ కులు లేవాలని సూచిం చారు. ఏమౌ తుందనీ అంటూనే కుర్చీలో నుంచి లేచారు.