టెన్షన్‌.. టెన్షన్‌..

– కౌంటింగ్‌కు మిగిలింది మరో మూడు రోజులే..
– ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
నవతెలంగాణ- కల్వకుర్తి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఉ త్కంఠ కొనసాగుతుంది. ఎన్నికల ఫలి తాలకు మరో మూడు రోజులు మాత్ర మే గడువు ఉండడంతో ఫలితాలపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. వచ్చేనెల రెండవ తేదీన ఎమ్మెల్సీ ఎన్ని కలకు సంబంధించి ఓట్లు లెక్కించేం దుకు అధికార యంత్రాంగం ప్రారం భించింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు హోరా హోరిగా తలపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలు తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసు కొని ముందుకు సాగింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ విజ యంపై వారికి నమ్మకం లేకుండా పోయింది. ప్రతి పక్ష పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరా రు. ఈ నేప థ్యంలోనే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయంపై ధీమాతో ఉంది. మొత్తం 1439 ఓట్లకు గాను 1437 ఓట్లు పోల్‌ అయినట్లు ఎన్నిక ల అధికారులు ప్రకటించారు. మొత్తం 99.86 శాతం పోలింగ్‌ నమోద యింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సైతం కొడంగల్‌ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకు న్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌ రెడ్డిలు ఎన్నికలలో పోటీపడి కోట్లాది రూపా యలు ఖర్చు చేసినట్లు అప్పట్లో ప్రచా రం సాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటుకు 4లక్షలు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటుకు మూడు లక్షలు పంచినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ నేప థ్యంలోనే విజయంపై ఇద్దరు నాయ కులు దీమాతో ముందుకు సాగుతున్న ప్పటికీ లోలోన ఆందోళన చెందుతున్న ట్లు ప్రచారం సాగుతుంది. మరో మూడు రోజులు వెయిట్‌ చేస్తే ఎమ్మె ల్సీ ఉప ఎన్నికల ఫలితాలు వస్తాయి..

Spread the love