టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

– మొదటిరోజు 77.27 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం మొదటిరోజు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌-ఏ), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పార్ట్‌-1 (కాంపొజిట్‌ కోర్సు), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పార్ట్‌-2 (కాంపొజిట్‌ కోర్సు) పరీక్షకు 11,489 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 8,878 (77.27 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. 2,611 (22.73 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని వివరించారు. మొదటిరోజు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు.

Spread the love