వచ్చే నెల 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 16 నుంచి 23 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు. 22 వేల మంది పరీక్షలకు హాజరు కానుండగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Spread the love