నవతెలంగాణ – అమరావతి : ఏపీలోని రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులు క్షేమంగా బయటపడ్డారు. రాజమండ్రి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పించేందుకు 2023లో నాటి కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొత్త టెర్మినల్ భవన పనులకు భూమి పూజ చేశారు.