టీటీడీలో ఆర్జిత సేవలు రద్దు

crowd-of-devotees-in-tirumala-2నవతెలంగాణ – తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. అలాగే రేపు మాడవీధులలో ఉట్లోత్సవం నిరహించనున్నారు. దీంతో రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇక తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో వేచివున్నారు తిరుమల శ్రీ వారి భక్తులు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. 75,804 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. అటు 32,198 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లుగా నమోదు అయింది.

Spread the love