నిబంధనలు గాలికి…

– ఇష్టారాజ్యంగా పెట్రోల్‌బంక్‌ల యాజమాన్యాలు
– ఇబ్బందుల్లో వినియోగదారులు
నవతెలంగాణ – ఉండవల్లి
పెట్రోల్‌ బంక్‌ల యజమానులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని వినియోగదారులు పేర్కొం టున్నారు. దీనికి తోడు అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమంగా యజమానులు సొమ్ము చేసుకునేందుకు వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారులకు మామూలు ముట్టు చెప్తే చాలు… పలకరించే దాఖలాలు లేవన్న విమర్శలు లేకపోలేదు.
నాణ్యత ప్రమాణాలు కరువు..
అల్లంపూర్‌ చౌరస్తాలో పుట్టగొడుగుల్లా పెట్రోల్‌ బంక్‌లు వెలిశాయి. సంపాధనే ధ్యేయంగా పెట్రోల్‌ బంకులు యజమానులు కల్తీ చేస్తూ వాహన దారులను మోసగిస్తున్నారు. అల్లంపూర్‌ వెళ్లే పెట్రోల్‌ బంక్‌లు పెట్రోలు నాణ్యత లేదని పలుమార్లు అడిగిన యజమాన్యం పట్టించుకోక పోవడంతో నాణ్యత పై పరిశీలించాలని వినియో దారులు అధికా రులను కోరుతున్నారు.
పేపర్‌ ఆయిల్‌ లేకపోవడం…
పెట్రోల్‌ బంకుల వద్ద నాణ్యత పరిశీలన కోసం పేపరు క్వాలిటీ లేకపోవడంతో యజమానులు పరిశీలించడం లేదనేది పలువురు పేర్కొంటున్నారు. పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు బోర్డు నమూనా సక్రమంగా లేకపోవడంతో లైసెన్స్‌ దారులు లేకుండా పేరుకు మాత్రమే లైసెన్స్‌ పేరు పెట్టుకొని నడుపుకోవడం జరుగుతుంది. ప్రతి పెట్రోల్‌ బంక్‌ను సివిల్‌ సప్లై నుంచి అనుమతి పొందిన డీలర్‌ అమ్మకాలు చేపట్టాలి. పౌరసరఫరాల శాఖ నిబంధనలు ఉల్లం ఘిస్తూ పెట్రోల్‌ బంకులు యజమానాల్లో ఇష్టాను సారంగా నిర్వహిస్తున్నారు. వినియోగదారులకు డీజిల్‌, పెట్రోల్‌ గ్రామాలకు తరలించి ఏజెంట్ల ద్వారా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అధిక రేట్లకు అమ్ముకుంటూ గ్రామీణ ప్రాంతంలోనూ వాహ నాలకు పెద్ద మొత్తంలో సరఫరా జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ చేసి పెట్రోల్‌ బంకుల పై యాజమాన్యాల పెత్తనం, ఇబ్బందులను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
సౌకర్యాలు కరువు..
పెట్రోల్‌ బంకులలో సౌకర్యాలు లేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. మూత్రశాలలు , మరుగుదొడ్లు , నీటి సౌకర్యాలు తదితర వంటివి ఏర్పాటు చేయాల్సి ఉండగా యజమాన్యాలు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు లేకపోలేదు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం గంటలతరబడి నిరీక్షించే పరిస్థితులు నెలకొన్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్రోల్‌, డీజిల్‌ బ్లాక్‌లో..
పెట్రోల్‌, డీజిల్‌ గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారులకు తరలించి బ్లాక్‌లలో విక్రయి స్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. అధిక రేట్లకు అమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న దుకాణదారులు లీటర్‌ పై నలభై రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. పెట్రోల్‌ బంక్‌ యజమానులు షార్టేజ్‌ ఉన్నదని వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
కొలతల్లో మోసాలు..
పెట్రోల్‌.. డీజిల్‌ బంకులలో కొలతలలో మో సాలు కొనసాగిస్తూ. వినియోదారులను మోస గిస్తున్నారని, కొలతలు వేయడంలో యజ మాన్యాలు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక వినియో దారులు నష్టాల్లో మునిగిపోతున్నారు. కొల తల్లో నాణ్యత ప్రమాణాల్లో ధర నియంత్రణలో. అధికా రులు పట్టిక ఏర్పాటు చేయాల్సి ఉండగా. అవే మీ కనబడకుండా దాపరికంగా ఏర్పాటు చేసి నిర్వ హణ కొనసాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
అపరిశుభ్రంగా బంక్‌లు ..
పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణలో యజమాన్యాలు లేకుండానే సిబ్బంది ద్వారా నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిసరాల అపరిశుభ్రంగా మారి చెత్త చెదారంతో పెట్రోల్‌ బంకుల ముందు ఈగలు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో వర్షాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బంకుల సమీపంలో తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే ప్రభుత్వా ధికారులు చర్యలు తీసుకోవాలని వినియోదారులు కోరుతున్నారు.

Spread the love