ఘోర విషాదం..కొండపోచమ్మ సాగర్‌ డ్యామ్‌లో పడి ఐదుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మర్కూక్‌ మండలంలోని కొండపోచమ్మ సాగర్‌ డ్యామ్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. నగరానికి చెందిన ఏడుగురు యువకులు శనివారం కొండపోచమ్మ సాగర్‌కు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. మృతి చెందిన ధనుష్‌, లోహిత్‌ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Spread the love