టెట్‌ సరే..డిఎస్సీ ఎప్పుడు

ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి : టిపిటిఎఫ్‌
నవతెలంగాణ – జనగామ కలెక్టరేట్‌ : ప్రభుత్వం, తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఒకే ఒక డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేశారని, ఇప్పటికీ రాష్ట్రంలో పాఠశాల విద్యలో 20 వేల ఖాళీలు ఉన్నప్పటికీ డిఎస్సీ నిర్వహించకుండా నియామకాలు చయేయకుండా కేవలం టెట్‌లు మాత్రమే నిర్వహించి ఉపాధ్యాయ అర్హత కలిగిన నిరుద్యోగులను మభ్యపెడుతుందని టిపిటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం స్థానిక యూనియన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఖాళీలను భర్గీ చేయకుండా ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణమవుతుందన్నారు. 1994 నుండి 2012 వరకు 9 డిఎస్సీలు నిర్వహించిందని, సగటున ప్రతి రెండు సంవత్సరాలకు ఒక డిఎస్సీ నిర్వహించి ఖాళీలను భర్తీ చేశారన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం 9 ఏళ్ళుగా కేవలం ఒకే ఒక డిఎస్సీ నిర్వహించిందని, ప్రభుత్వం వెంటనే డిఎస్సీ నిర్వహించి ఖాళీలను భర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టిపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రాజు, కారదర్శి లక్ష్మయ్య, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love