– తొలిరోజే రికార్డు స్థాయి ఆదాయం
– రాష్ట్రవ్యాప్తంగా 1475 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్
– మొత్తం 2.5కోట్లకుపైగా ఆదాయం
– టీజీ 09 0001కు..9.61లక్షల పలికిన ధర
– రాష్ట్రంలో ‘టీజీ’తో మొదలైన వాహన రిజిస్ట్రేషన్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. దీంతో శుక్రవారం టీజీ సిరీస్‌కు సంబం ధించిన నెంబర్ ప్లేట్‌ను ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో రవా ణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్, ఆ శాఖ ఉన్నతా ధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. టీఎస్ నుంచి టీజీ పేరుతో మారడంతో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపించారు. అందు లో టీజీ ప్రారంభ సిరీస్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. తొలిరోజు శుక్రవారం రాష్ట్రవ్యాప్తం గా 1475 వాహనాలు రిజిస్ట్రర్ అవ్వగా.. రవాణాశాఖకు రికార్డు స్థాయి ఆదాయం లభించింది. కేవలం ఒక్కరోజులోనే 1475 వాహనాలకు సాధారణ, ప్రత్యేక నంబర్లు కేటాయిం పు ద్వారా రవాణాశాఖకు 2.5కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అలాగే ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలోనూ కేవలం ఒక్కరోజే సాధారణ, ప్రత్యేక నెంబర్ల కేటాయింపు ద్వారా రూ.30.49 లక్షల ఆదాయం లభించడం విశేషం.
ఇదిలావుంటే రాష్ట్రంలోని 54 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతీరోజు 3వేలకుపైగా వాహనాలు నమోదవుతుండగా.. గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహదీ పట్నం, మలక్‌పేట్, బండ్లగూడ, మేడ్చల్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్ ఆఫీసుల్లో ఒకరోజుకి 1500లకుపైగా కొత్త వాహనాలు రిజిస్ట్రర్ అవుతున్నాయి. వీటిలో వెయ్యికిపైగా టూవీలర్లు ఉంటుండగా.. మిగతావి కార్లు, ఇతర రవాణా వాహనాలు ఉన్నాయి. అయితే షోరూ మ్‌లలో డీలర్ల వద్ద తాత్కాలిక నెంబర్లపై రిజిస్ట్రేషన్… అనంతరం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయా లకు వస్తారు. ఈ నేపథ్యంలో రవాణాశాఖ ప్రతి మూడు నెల లకు ఒకసారి విడుదల చేసే పదివేల నంబర్లపైన వాహనా లను రిజిస్ట్రేషన్ చేస్తుంది. ప్రతి ఆర్టీవో ఆఫీసుల్లో ఏ రోజురోజుకూ నమోదయ్యే వాహనాల సంఖ్యకు అను గుణం గా ఈ నెంబర్లను విడుదల చేస్తుంటారు. ప్రతీరోజు విడుదల చేసేవాటిలోనే వాహనదారులు తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొని.. కావాల్సి న నంబర్‌ను పొందవచ్చు. ఉదాహరణకు 0001 నుంచి 2,5,7,9 0099, 9999, 999, 1234, 6666 వంటి ఫ్యా న్సీ నంబర్ల కోసం వాహనదారులు రూ.లక్షల్లో చెల్లించి నంబర్లు దక్కించుకోవడం విశేషం.
కాగా ‘టీఎస్’కు బదులు టీజీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త సిరీస్ ప్రారంభమైన నేపథ్యంలో వాహనదారులు టీజీ నెంబర్ల కోసం పోటీపడ్డారు. ఫలితంగా ప్రత్యేక నంబర్లకు ఫుల్ డిమాండ్ కనిపించింది. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ఆర్టీవో ఆఫీసుల్లో ప్రత్యేక నెంబర్ల కోసం పలువురు వాహన దారులు ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పోటీపడ్డారు. దీంతో తొలిరోజు 1475 వాహనాలకు సాధారణ, ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు తో రవాణాశాఖకు రూ. 2.5కోట్లకుపైగా ఆదాయం వచ్చిం ది. ఇదిలా వుంటే ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్ లో టీజీ09 0001 నంబర్‌కు అనుహ్యమైన పోటీ కనిపిం చింది. రుద్రరాజు రజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెంబర్ కోసం ఏకంగా 9,61,111 చెల్లించి సొంతం చేసుకున్నారు. గత జనవరిలో టీఎస్ సిరీస్‌లో నిర్వహించిన ఈ వేలంలో 0001కు కేవలం 6లక్షలకుపైగా ధర పలికిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే భవ్య సింధు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు ప్రయివేట్ లిమిటెడ్ తమ విలువైన కారు కోసం రూ. 2.30లక్షలు చెల్లించి టీజీ09 0909 నెంబర్‌ను దక్కించు కుంది. శాన్వితా రెడ్డి అలేటి తమ విలువైన కారు కోసం రూ.2.21 లక్షలు వెచ్చించి టీజీ09 0005 నెంబర్‌ను దక్కించుకున్నారు. టీజీ09 0002 నంబర్ కోసం ఎం. దుష్యంత రెడ్డి 1.22లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. టీజీ09 0369 నెంబర్ కోసం సాటోరి డిజైన్స్ అనే సంస్థ రూ. 1.20లక్షలు వెచ్చించింది. టీజీ09 0007 నెంబర్ కోసం ఎస్‌హెచ్ హరినాథ్ రెడ్డి రూ.1,07లక్షలు చెల్లించారు. శుక్రవారం నిర్వహించిన టీజీ ప్రత్యేక నెంబర్ల ఈ వేలం ద్వారా ఖైరతాబాద్ ఆర్టీఏకు ఒక్కరోజే రూ. 30,49,589 ఆదాయం సమకూరినట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(జేటీసీ) సి. రమేష్ తెలి పారు. అలాగే తిరుమలగిరి (8.52లక్షలు), బండ్లగూడ (3.33లక్షలు), మెహిదీపట్నం(5.38లక్షలు) ఆర్టీవో కార్యాల య పరిధిలో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు అనూహ్య స్పందన లభించిందని జేటీసీ తెలిపారు.