టీఎస్ఆర్టీసీ నుంచి మారనున్న టీజీఎస్ఆర్టీసీ

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులను ఇక నుంచి టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ పేరును సైతం టీఎస్ఆర్టీసీ నుంచి టీజీఎస్ఆర్టీసీగా మార్చాలని నిర్ణయించారు. త్వరలో సంస్థ లోగోలోనూ మార్పులు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో TSని టీజీతో రీప్లేస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Spread the love