ప్రజలకు ధన్యవాదాలు

– కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
నన్ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిపించి, మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు…నాపై నమ్మకంతో కొత్తగూడెం అభ్యర్థిగా ప్రకటించినందుకు సీపీఐ పార్టీకి, పొత్తులో భాగంగా నాకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నాకు మద్దతు తెలిపిన టీజేఏసీ అధినేత కోదండరాం, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌. షర్మిల, ప్రజాపంథా పార్టీ, తెలుగు దేశం పార్టీ, సీపీఎం పార్టీ అధిష్టానాలకు ధన్యవాదాలు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి మరెంతో మంది నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని నా గెలుపు కోసం కృషి చేశారు. మీ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నెల రోజుల పాటు నా గెలుపు కోసం క్షేత్రస్థాయిలో, సోషల్‌ మీడియాలో అహర్నిశలు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, అక్కా,చెల్లెళ్లకు, అన్నా,దమ్ముళ్లకు పాదాభివందనాలు. నా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించడమే నా లక్ష్యం. కొత్తగూడెం అభివృద్ధి కోసం, నన్ను నమ్మిన ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తానని మాటిస్తున్నానని స్పష్టం చేశారు.
పలువురు శుభాకాంక్షలు…
కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా నియోజక వర్గంలోని పలువురు డాక్టర్లు, ప్రముఖులు, వ్యాపారులు, కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సేవా సంస్థలు, కుల, సంఘాల నాయకులు కూనంనేనిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయనను కలుసుకుని పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.మిఠాయి తినిపించి అభినందించారు.

Spread the love