పొన్నంను గెపించినందుకు ధన్యవాదాలు

– కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య
నవతెలంగాణ-కోహెడ
హుస్నాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్‌ను గెలిపించిన ఓటర్లు, నేందుకు సహకరించిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలకు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య ధన్యవాదాలు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలంతా అభివృద్ధి చేసే ఎమ్మెల్యేను గెలిపించేందుకు సహకరించారని తెలిపారు. ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అందించనుందన్నారు. కోహెడ మండలం నుండి 2614 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు తెలిపారు. సీపీఐ నేతలు, యువకులు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, ఉద్యోగ వ్యాపార వర్గాలు, సబ్బండ కులాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునే దిశగా కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నం చేస్తుందని రానున్న రోజులలో మండలాన్ని ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యాక్షుడు బస్వరాజు శంకర్‌, వింజపల్లి సర్పంచ్‌ బద్దం తిరుపతిరెడ్డి, నకిరెకొమ్ముల సర్పంచ్‌ వెల్డండి సతీశ్‌, వరికోలు ఎంపీటీసీ బోయిని నిర్మల జయరాజ్‌, వార్డు సభ్యులు వేల్పుల వెంకటస్వామి, మాజీ సర్పంచ్‌లు శెట్టి సుధాకర్‌, భీంరెడ్డి మల్లారెడ్డి, దొమ్మాట జగన్‌రెడ్డి, గొరిట్యాల లక్ష్మణ్‌, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు చింతకింది శంకర్‌, ఉపాధ్యాక్షుడు గూడ స్వామి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బీనవేని రాకేశ్‌, శివారెడ్డి, యూత్‌ మండల అధ్యక్షుడు దూలం శ్రీనివాస్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు రాచురి శ్రీనివాస్‌, కోఆర్డినేటర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ, నాయకులు చంద్రారెడ్డి, బందెల బాలకిషన్‌, రాగుల శ్రీనివాస్‌, చుక్క అశోక్‌, మంద కిష్టయ్య, చెన్నారెడ్డి, ముంజ శ్రీనివాస్‌, తిరుమల్‌రావు, ముంజ తిరుపతి, గోవిందు రమేశ్‌, రాజిరెడ్డి, జాప రాజిరెడ్డి, మంద శ్రీపాల్‌, మనిదీప్‌, శ్రీనివాస్‌, డాక్టర్‌ రాజు, నక్క అనిల్‌, వివిధ గ్రామాల అధ్యక్షులు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love