పండుగలకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు

Thanks to everyone who contributed to the festivities– నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో నిజామాబాద్ ,ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం జరిగింది అని సహకరించిన ప్రతి ఒక్కరికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ గురువారం కృతజ్ఞతలు తెలియజేశారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో దాదాపు 6000 గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9 మరియు 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేశారు. గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే తేది 16-9-2024 నా మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్బంగా నిజామాబాద్ కమీషనరేటు అంత 20 ప్రదేశాలలో ఉత్సవ వేడుకల ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేయడం జరిగింది. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి పద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం నందిపేట మండలంలోని ఉమ్మోడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వలన ప్రజలందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇవి కాకుండా మిగితా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే అన్ని వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి మజీద్  కమిటీలు, విగ్రహ గణేష్ కమిటీలు మరియు అన్ని మతాల ప్రజలు, ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించడం జరిగింది. అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ గ్రామ పంచాయతి. మున్సిపాలటి, అబ్కారీ శాఖ ఫైర్ సర్వీస్ మరియు ఎన్.సి.సి గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించడం జరిగింది. మరియు పత్రిక ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా / ప్రింట్ మీడియా సిబ్బంది అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అభినందనలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు.
Spread the love