సీఎంకు థ్యాంక్స్‌…

Thanks CM Sir.. – వీసీ సజ్జనార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, టీఎస్‌ఆర్టీసీ
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు. ఎన్నో ఏండ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుల శ్రమకు దక్కిన గౌరవం ఇది. ఈ నిర్ణయంతో కార్మికులు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ, ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తారని ఆశిస్తున్నాను.
రుణపడి ఉంటాం
– బాజిరెడ్డి గోవర్థన్‌, చైర్మెన్‌, టీఎస్‌ఆర్టీసీ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయానికి రుణపడి ఉంటాం. ఇది కార్మికుల ఎన్నో ఏండ్ల కల. ఓవైపు కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేస్తుంటే, సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల కష్టాలన్నింటినీ ఏకకాలంలో దూరం చేసిన ఘనత ఆయనదే.

Spread the love