జిల్లా ప్రజలకు ధన్యవాదాలు

– నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి 
నవతెలంగాణ- కంఠేశ్వర్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది శుభ సూచకం అని అదే విధంగా జిల్లాలో జరిగిన విజయాలను, అపజయాలను స్వీకరిస్తూ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డిని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గా గెలిచిన భూపతిరెడ్డి ని నాయకత్వంలో జిల్లాలో ప్రజా సంక్షేమమే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ఆగడాలను, అవినీతిని సమీక్షిస్తూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి నాయకత్వంలో ప్రజారంజక పాలన అందిస్తామని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు.
Spread the love