నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ గ్రహశకలం భూమికి అతి సమీపంగా దూసుకెళ్లనుందని నాసా చాలారోజుల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ శకలం దూసుకెళ్లేది నేడే. 720 అడుగుల చుట్టుకొలత కలిగిన ఆస్టరాయిడ్ పెను వేగంతో భూమికి 6.20 లక్షల మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. అది భూమిని ఢీకొడుతుందని, యుగాంతమేనని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, దాని వల్ల భూమికి ముప్పు లేనట్లేనని నాసా క్లారిటీ ఇచ్చింది.