అందుకే ఏపీ ప్రజలు జగన్ కు తగిన గుణపాఠం చెప్పారు: సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేసి చెప్పినందుకే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు తొలగించానని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలా టీడీపీపై బురదజల్లి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీని ఖతం చేయాలని ప్రయత్నించి, చివరికి జగనే ఖతమైయ్యారని అన్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారంటే దానికి జగన్ చేసుకున్న స్వయంకృపరాధమే కారణమని తెలిపారు. పాలనను విస్మరించి, అక్రమాలకు పాల్పడడంతో పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది అని, అందుకే జగన్ కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.

Spread the love