నవతెలంగాణ – కంటేశ్వర్
ఈనెల 7వ తేదీన జిల్లాకు మందకృష్ణ మాదిగ వస్తున్నట్లు ఈనెల 7న జరిగే ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఉమ్మడి జిల్లా సమావేశాన్ని చేయాలని ఎం ఎస్ పి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జూన్ 7 నాడు జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్ కరపత్రాలు ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. ఈ నెల 7 నాడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నిజామాబాద్ జిల్లాకు రావడం జరుగుతుంది. జూన్ 7 నాడు పొద్దున 9 గంటలకు మంద కృష్ణ మాదిగ అనాధ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న అనాధలతో మాట్లాడుతారు. అలాగే 12 గంటలకు విహెచ్పిఎస్ అధ్వర్యంలో వికలాంగులకు 6000 పెన్షన్ పెంచాలని డిమాండ్ తో జరిగే కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా లో మంద కృష్ణ మాదిగ పాల్గొంటారు. అలాగే సాయంత్రం 4 గంటలకు ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సమావేశం లో మహజన నేత మందకృష్ణ మాదిగ పాల్గొంటారు.జూన్ 7 నాడు జరిగే ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ గంధ మల్ల నాగభూషణం మాదిగ , ఎం ఎస్ పి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డల్ల సురేష్ మాదిగ , విహెచ్పిఎస్ జాతీయ నాయకురాలు సుజాత సూర్యవంశి , ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కనక ప్రమోద్ మాదిగ , ఎం ఎస్ వి జాతీయ నాయకులు మానికొల్ల గంగాధర్ మాదిగ ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు లసింగారి భుమాన్న మాదిగ , ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా నాయకులు రోడ్డ ప్రవీణ్ మాదిగ ఎం ఎస్ పి నిజామాబాద్ జిల్లా టౌన్ నాయకులు శ్రీరాములు మాదిగ తదితరులు పాల్గొన్నారు.