నవతెలంగాణ – మధ్యప్రదేశ్ : పోలీసుల నిర్లక్ష్యంతో నిందితుడు జైలునుంచి తప్పించుకున్న ఘటన గుజరాత్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సర్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హత్య కేసులో నిందితుడిగా ఉన్న దశరథ్ జాట్‌ను కోర్టు విచారణ తర్వాత పోలీసులు నేరుగా జైలుకు తరలించడం మానేసి, తిరుగు పయనంలో దగ్గరల్లోని పవగధ్ మహాకాళి దర్శనం కోసం ఆగారు. కొంత దూరంలో ఉన్న రోప్ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకొని నిందితుడితో సహా నడుచుకుంటూ వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దశరథ్.. పోలీసుల కళ్లు కప్పి భక్తుల్లో కలిసిపోయి తప్పించుకున్నాడు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.