నవతెలంగాణ – మునుగోడు
జగిత్యాలలో ఆశా వర్కర్ పై లైంగికదాడికి పాల్పడ్డ నిందితున కఠినంగా శిక్షించి , బాధితురాలికి న్యాయం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఆశా వర్కర్స్ తో కలసి ప్రాథమికా ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్ కు న్యాయం చేయాలని లైంగికదాడికి పాల్పడిన నిందితునిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. గ్రామంలోని ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఆశా వర్కర్లపై లైంగిక దాడులకు పాల్పడడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్స్ లకు రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగికదాడులకు కఠిన శిక్షలు పడేవిధంగా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇటువంటి జరగకుండా అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి నిర్మల, నాగమణి, ఏ కమల, ఎం కవిత, జె ఇందిరమ్మ, బి లక్ష్మి, ఎం ధనలక్ష్మి, ఎన్ లక్ష్మి, డి మల్లేశ్వరి, ఎస్ మమత తదితరులు ఉన్నారు.