ఉద్యోగ నియమాకాలకు వెళ్తున్న బస్సును ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లాకు చెందిన 438 మంది అభ్యర్థులు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడానికి వెళుతున్న బస్సులను భువనగిరి జూనియర్ కాలేజీలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర,  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి  వీరారెడ్డి జెండా ఊపి పంపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుండి 438 మంది ఉద్యోగాలు సాధించడం జిల్లాకే గర్వకారణమని, ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, అధికారులు, పోలీస్ అధికారులు  పాల్గొన్నారు.
Spread the love