అభివృద్ధికి చిరునామా ‘దయాకర్ రావు’

– కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకడం లేదు
– రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ -పెద్దవంగర: అభివృద్ధికి చిరునామాగా ఎర్రబెల్లి నిలుస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోనే గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. గత 60 ఏళ్లుగా ప్రతిపక్షాలు చేసిన అభివృద్ధి శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని, నేను పాలకుర్తిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పేర్కొన్నారు. నాపై పోటికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కే పట్టం కట్టాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంధకారంలోకి వెళ్లినట్లేనని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని కొరిపల్లి, ఉప్పెరగూడెం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి ఎర్రబెల్లి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, పాలకుర్తి యాదగిరిరావు, ముత్తినేని శ్రీనివాస్, సుధాకర్, బొమ్మెరబోయిన రాజు, విశ్వనాథుల జ్ఞానేశ్వర చారి, దుంపల సమ్మయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ షర్ఫీద్దీన్, మేకల శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love