బ్యాంకులో జరిగే లావాదేవీలన్నీ సంఘాల ద్వారా చేయడమే లక్ష్యం

– పంట రుణాలు లేని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేదే నాబార్డ్ ధ్యేయం 
– సమీకృత వ్యవసాయానికి రుణాలు
– కమర్షియల్ బ్యాంకుకు దీటుగా కేడీసీసీ
– కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్రావు
నవతెలంగాణ జమ్మికుంట :
బ్యాంకుల్లో జరిగే లావాదేవీలన్నీ సింగిల్ విండో కార్యాలయం ద్వారా జరిపిస్తూ రైతులకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. గురువారం స్థానిక కేడీసీసీ బ్యాంకు ను సందర్శించారు. లావాదేవీల గూర్చి బ్యాంకు మేనేజర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యాంకు ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ పరంగా భారతదేశంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో మొదటిసారిగా  కంప్యూటరై జ్ డ్ చేసిన  రాష్ట్రము తెలంగాణ అని తెలిపారు. రైతులకు సేవ విషయంలో తెలంగాణ రాష్ట్రము ఒక మోడల్ గా ఎంపికైన తర్వాత దేశం లోని  రాష్ట్రాలలో కేంద్ర మంత్రి అమిత్ షా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రాథమిక సహకార సంఘాలు బ్యాంకు కు బ్రాంచీ లాగా పని చేయాలన్నది మా సంకల్పం అని చెప్పారు. తెలంగాణ మోడల్ అనే పేరు వచ్చిందని దీంతో నీతి అయోగ్ మన దగ్గరకు వచ్చిందని చెప్పారు. కమర్షియల్ బ్యాంకు ధీటుగా కేడీసీసీ ముందుకు వెళుతుందన్నారు. ఇంతకుముందు కే డి సి సి ట్రాక్టర్లకు అడపదడప లోన్లు ఇచ్చేదని, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన అవసరాలతో పాటు, ఇతర అవసరాలకు లోన్స్ ఇస్తున్నామని తెలిపారు. చదువుకున్న యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 40 వేల కోట్ల లావాదేవీలు ఈ బ్యాంకు ద్వారా చేస్తున్నామన్నారు. తనుగుల, ధర్మారం సొసైటీలు కేడీసీసీలో కలపడం అభినందనీయమన్నారు. మల్యాల భోగంపాడు సొసైటీలు కూడా ఈ బ్యాంకులో విలీనం కాబోతున్నాయన్నారు. 72 బ్రాంచీలు కేంద్ర సహకార సంఘం లో ఉన్నాయన్నారు. దేశంలో మెడిసిన్, ఐఐటి చదివే విద్యార్థులకు   25 లక్షల రుణాలు   ఇస్తున్నామని, ఇప్పుడు దానిని 50 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నమన్నారు. ఏ కొత్త స్కీము తీసుకొచ్చిన దేశంలో  పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ బ్యాంకులో అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. సమీకృత వ్యవసాయము గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల కొరకు చొప్పదండిలో ఒక రైతుకు రెండు కోట్ల 70 లక్షలు రుణమిస్తే సంవత్సరములోనే అతని ఆదాయం రెట్టింపు అయిందని  అని చెప్పారు. పంట రుణాలు లేని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేదే నాబార్డ్ లక్ష్యమన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ అయిన వారికి కొత్త రుణాల చెక్కులను రైతులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కేడిసిసి బ్యాంకు జిల్లా ఉపాధ్యక్షులు పింగిలి రమేష్, ధర్మారం సొసైటీ అధ్యక్షులు కట్టంగూరి శ్రీకాంత్ రెడ్డి, హమాలి సంఘం మండల అధ్యక్షులు ఓ ల్లాల శ్రీనివాస్ గౌడ్, బ్యాంక్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love