పేదలకు సహాయం చేయడమే లక్ష్యం..

నవతెలంగాణ-ఊరుకొండ : పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆపద్బాంధవుడిగా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న గొప్ప నాయకుడు మాధారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి అని మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన బోయ బాలకిష్టయ్య(50) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని ద్యాప నిఖిల్ రెడ్డి గారికి తెలియజేశారు. తక్షణమే స్పందించిన నిఖిల్ రెడ్డి నిఖిలన్న యువసేన పేరిట మృతుడి కుటుంబానికి 5వేలు అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ అమరచింతల వెంకటమ్మ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తీర్మని రవీందర్ గౌడ్ లు ఇద్దరు రూ.2 వేల చొప్పున మొత్తం రూ. 9000/-అందించారు. ఊర్కొండ మండలంలోని బావాజీ తండాకు చెందిన జే.రవినాయక్(40) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ద్యాప నిఖిల్ రెడ్డి తక్షణ సాయం కింద 5వేలు అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు అజహర్, కాంగ్రెస్ యువజన విభాగం మండల మాజీ అధ్యక్షుడు  మనోహర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కప్పేర చంద్రయ్య, నాయకులు కైసర్, అమెర్, రమేష్, మాసుం, హరీష్, బొందయ్య, శ్రీనివాస్,  వెంకటయ్య, అరిఫ్, కప్పేర మల్లేశ్, బావాజీ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు రమేష్, నరేష్, ఆంజనేయులు, రాములు, అనిల్,  పీర్యా, శంకర్, బీచ్యా, రాజు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love