నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
ఆపదలో ఉన్న వారిని తన వంతు సహాయం చేసి ఆదుకోవడమే తన లక్ష్యమని డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు గడగోజు రవీంద్ర చారి అన్నారు.. సోమవారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కట్టంగూర్ మండలం పాలెం గ్రామానికి చెందిన గోవిందమ్మకు అత్యవసరంగా రక్తం అవసరం ఉండడం తో విషయం తెలుసుకుని 22వ సారి రక్తదానంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నర్రా రాఘవరెడ్డి రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో.. ఆపదలో ఉన్న పేదప్రజలను ఆదుకుంటామన్నారు. అనేకమంది వైద్యానికి డబ్బులు పెట్టలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన వెంట కక్కిరేణి స్టాలిన్,వెంకటాచారి ఉన్నారు.