అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ-జహీరాబాద్‌
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గం న్యాల్కల్‌ మండలంలోని బసంత్‌పూర్‌ మంగళవారం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. నిరుపేదలకు నిర్మించి ఇవ్వడంతోపాటు.. అర్హులకు భూములిచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న వారికి ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. ఈ మండలానికి చెందిన ఇశాంత్‌ రెడ్డి ప్రాణ త్యాగం చేసిన విషయం తెలిసిందేనని.. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు.కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వమిచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు బాకీ ఉన్నాయని.. వాటిని కూడా త్వరలోనే అమలు పరుస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం కషి చేస్తు న్నదన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గం తన నియోజ కవర్గానికి ఆనుకొని ఉన్నందున.. ఇక్కడ అభివద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే మాణిక్యరావు మాట్లాడుతూ.. మంత్రి తమ నియోజకవర్గంలో పర్యటనకు రావడం ఆనందంగా ఉందన్నారు. కానీ అక్కడక్కడ చేపట్టా ల్సిన అభివద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశా రు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, వివిధ శాఖ ల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చాల్కి గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌ మంత్రికి స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రోగులకు సహనంతో వైద్య సేవలు అందించాలి..
నవతెలంగాణ-నారాయణఖేడ్‌రూరల్‌
వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రికి వచ్చే రోగులకు సహనంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం నారాయణఖేడ్‌ లోని ఏరియా ఆసుపత్రిని మంత్రి సందర్శిం చారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరిగి పరిశీలించారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌, బ్లడ్‌ స్టోరేజీ, ఐసీటీసీ ల్యాబ్‌, మెడికల్‌ ఓపి, డెంటల్‌, ఇంజక్షన్‌ రూమ్‌, ఎక్స్‌ రే, ఆర్థోపెడిక్‌ ఓపి, టెక్నికల్‌ ల్యాబ్స్‌, డయాలసిస్‌, జనరల్‌ పేసెంట్స్‌ వార్డులు,తదితర వార్డుల ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా డయాలసిస్‌ వార్డులో ఒక మహిళతో, జనరల్‌ వార్డులో పేషంట్లతో మంత్రి మాట్లాడారు. ఆయా వార్డులలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను అరా తీశారు. ఎక్కడి నుంచి వచ్చారంటూ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్స్‌, సిబ్బంది బాగా చూస్తున్నారా? వైద్య సేవలు బాగా అందు తున్నాయా? మందులు ఇచ్చారా అంటూ వారిని ఆరా తీశారు. వారు బాగానే చూస్తున్నారని, మందులు ఇచ్చారని తెలిపారు.అక్కడే ఉన్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటలక్ష్మి కి ఆయా రోగులకు మరింత మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రికి ఇంకేమైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అవసరం ఉంటే ప్రతిపాదనలు అందించా లని డీసీహెచ్‌ఎస్‌ సంగారెడ్డికి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కు సూచించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌,శాసన సభ్యులు డా.సంజీవరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిదులు,డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ గాయత్రీ దేవి, తదితరులు ఉన్నారు.

Spread the love