– మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్రంలో తాగునీటి సమస్యలను.అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరించాలని, రానున్న వేసవి కాలంలో ఎండ తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా వాడుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయినప్పటికీ త్రాగునీటికి,వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించడానికి ఇరిగేషన్ అధికారులతో తమ మంత్రులు అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారని పూర్తిస్థాయిలో వేసవిలో ఏర్పడే సమస్యలను అధిగమించడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంథని లో సైతం రానున్న రోజుల్లో తాగునీటి కి సమస్య ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తాగునీటికి సంబంధించిన ఫిల్టర్ బెడ్ ను సైతం పునరుద్ధరిస్తామని, ప్రజలకు ఏమైనా అసౌకర్యాలు ఉంటే మున్సిపల్ చైర్మన్,అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.