దొరల ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి

– రాహుల్ గాంధీ
నవతెలంగాణ- మోర్తాడ్ :
రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కొనసాగుతుందని ఆ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం మోర్తాడ్ కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అందిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తుందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం దోచుకోవడం ఆ డబ్బును దాచుకోవడం జేబులో పెట్టుకోవడానికి పరిమితమవుతుందని జేబులో పెట్టుకున్న డబ్బులను ప్రజలకు అందించడానికి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, గత పది సంవత్సరాలుగా మీ డబ్బును దోచుకొని ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని అలాంటి దొరల కుటుంబ పాలనను తరిమికొట్టాలని సూచించారు. కర్ణాటక లో మహిళలకు ఉచిత సర్వీస్ వలె తెలంగాణలో సైతం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రతి నెల 200500 రూపాయలను ప్రత కుటుంబానికి అందిస్తామని అన్నారు 500 రూపాయలకే సిలిండర్ ప్రతి కుటుంబానికి 200 యూనిట్లో కరెంటు ఉచితంగా ఇస్తామని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు పసుపు మద్దతు ధర కల్పిస్తామని ఎం ఎస్ పి కంటే అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇండ్లు లేని అందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలతో ఇండ్లు నిర్మిస్తామని, చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం రావాలని దొరల సర్కారులను తరిమికొట్టాలని సూచించారు. తన ఎంపీ స్థానాన్ని రద్దు చేసిన, ఇల్లు కాలి చేయించిన తాను మాత్రం భారతదేశ ప్రజలలోనే ఉంటానని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తనపై 24 కేసులు నమోదు చేసిందని నేను మాత్రం ఇబ్బందులకు గురికాకుండా ప్రజా సంక్షేమం కోసమే పాటు పడతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాలపై బీజేపీ సిబిఐ ఈడి తో ఎంక్వయిరీ చేపిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఎందుకు ఎంక్వయిరీ చేపించడం లేదని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాని ఆశీర్వదించి తమ నాయకుని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్, సుదర్శన్ రెడ్డి, మధు ఆషికి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, సునీల్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.
Spread the love