హాలీవుడ్ న‌టుడు జానీ వాక్ట‌ర్‌ను కాల్చి చంపిన దుండ‌గులు!

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో దుండ‌గులు మ‌రోసారి రెచ్చిపోయారు. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు జానీ వాక్ట‌ర్‌ (37) ను కాల్చి చంపారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న‌ కారులో దోపిడీకి య‌త్నించిన‌ అగంత‌కులు కాల్పులు జ‌ర‌ప‌డంతో జానీ వాక్ట‌ర్ చ‌నిపోయాడు. శనివారం తెల్లవారు జామున 3 గంట‌ల ప్రాంతంలో (అమెరికా కాల‌మానం ప్ర‌కారం) లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు వాక్ట‌ర్ త‌ల్లి స్కార్లెట్, పోలీసులు తెలిపారు.

Spread the love