రెండు కోట్లతో జ్యోతిష్యుడు పరారీ..

నవతెలంగాణ – వేములవాడ 
ఆశ అనేది ఎంత పనైనా చేయిస్తుంది అని తెల్పడానికే ఈ సంఘటనని ఒక నిదర్శనం.. వేములవాడ పట్టణంలో ఓ జ్యోతిష్యుడు అందరితో సఖ్యంగా, నమ్మకంగా ఉంటూ జ్యోతిష్యం చేస్తూ పూజలు, అభిషేకాలు జాతకాలు  చెప్తూ ఆయన దగ్గరికి వచ్చే వారి నమ్మిస్తూ అధిక వడ్డీ ఆశ చూపుతూ పూజారి రూ.2 కోట్లు వసూలు చేసి, ఆ డబ్బుతో పరారైన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ఆయన ఉండే నివాసానికి వెళ్లి ఆరా తీయడంతో ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ వీధిలో మహేష్ అనే  అమ్మ భవాని పూజారిగా, శివ సాయిరాం జ్యోతిష్యాలయం నిర్వహిస్తూ జ్యోతిష్యం చెబుతుండేవాడు. ఆయన దగ్గరికి వచ్చే వారితో నమ్మకంగా ఉంటూ మరికొందరు స్నేహితులు, బంధువులు, నమ్మకస్తుల దగ్గర   వారి నుంచి డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం చెల్లింపులు  సజావుగా సాగాయి. నమ్మిన వారి దగ్గర రెండు లక్షల నుండి సుమారు 40 లక్షల వరకు ఇచ్చినవారు దగ్గర నుండి రెండు కోట్ల వరకు వసూలు చేశాడు. ఇచ్చిన వారిలో స్థానిక నాయకులు, పోలీసులు, ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. రెండు కోట్ల వరకు వసూలు చేసిన మహేష్ ఆ డబ్బుతో ఈ నెల మూడో తారీకు నుండి కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఆయన ఉంటున్న శివ సాయిరాం జ్యోతిష్యాలయంలో ఇంట్లో ఉండకపోవడంతో అనుమానం కలగడంతోగత వారం రోజుల క్రితంబాధితులు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు మొరపెట్టుకొని ఫిర్యాదు చేశారు. రెండు కోట్లతో ఉ డాయించినచ్చిన మహేష్ ని పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. మహేష్ లాంటి వారిని నమ్మి అధిక వడ్డీ వస్తుందని ఆశపడి మోసపోవద్దని పోలీసులు అంటున్నారు.
Spread the love