ఎబీవీపీ గుండాల దాడి పిరికిపంద చర్య…ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ

నవతెలంగాణ – హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకత్వం పై ఎబీవీపీ గుండాల దాడిని ఖండించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ కోరింది. ప్రైవేటు విద్యాసంస్థ అనుమతి లేకుండా యూనిఫామ్, బుక్స్ అమ్ముతుంటే ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై యాజమాన్యంకు మద్దతుగా నిలిచి ఎస్ఎఫ్ఐ నాయకత్వం పై దాడి చేశారు. కర్రలతో, బైక్ “కీ”లతో దాడి చేసి గాయపర్చారు. ఫీజులపై, విద్యార్ధి సమస్యలపై పోరాడుతు ప్రశ్నిస్తున్న ఎస్ఎఫ్ఐ పై భౌతికంగా దాడి చేయడం పిరికిపంద చర్య, చేతనైతే సమస్యలపై పోరాడాలి కానీ భౌతిక దాడులకు దిగడం సరైనది కాదు. ఎబివిపి దాడిని, మేథావులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్ధిలోకం ఖండించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి కోరారు.

Spread the love